టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య( Naga Chaitanya ) కెరియర్ లో తెరకెక్కిన భారీ సినిమా సవ్యసాచి.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
అయితే నాగచైతన్య కెరియర్ లో ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమా మళ్ళీ రాలేదు.ఈ సవ్యసాచి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో ఇప్పుడు ఒక సినిమా నిర్మితమవుతోంది.
ఆ సినిమాను గీతా సంస్థ నిర్మించనుంది.చందు మొండేటి, సాయి పల్లవి కాంబినేషన్( Chandoo Mondeti ) లో రూపొందనున్న పాన్ ఇండియా సినిమా ఇది.కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.జస్ట్ ఆన్ పేపర్‌నే 80 కోట్ల వరకు ఖర్చు తేలుతోందని తెలుస్తోంది.
వాస్తవానికి నాగ్ చైతన్య సినిమాగా అంత మార్కెట్ వుండదు.కానీ సబ్జెక్ట్ పరంగా ఖర్చు వుంది.కథకు ఆ రేంజ్ వుంది.అందుకే గీతా సంస్థ ముందుకే వెళ్లడానికి నిర్ణయించుకుంది.ఈ మేరకు ప్రాజెక్ట్ ను వేయబుల్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ తో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.టోటల్ నాన్ థియేటర్ హక్కులు కనుక నెట్ ఫ్లిక్స్ తీసుకుంటే ప్రాజెక్ట్ పని సులువు అవుతుంది.
ఈ మేరకు డిస్కషన్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.సవ్యసాచి( Savyasachi ) సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ కాస్త ఎక్కువే వుంది.
సముద్రం మీద ఎక్కువగా జరిగే కథ కావడంతో సిజి వర్క్ బాగా వుంటుంది.అందువల్ల కాస్ట్ ఎక్కువ పడుతోందని తెలుస్తోంది.
దీనికి తోడు పాన్ ఇండియా నటులను మరికొంత మందిని తీసుకుంటున్నారు.టెక్నీషియన్లను కూడా టాప్ పీపుల్ ను హైర్ చేస్తున్నారు.అందువల్ల మొత్తం మీద చైతన్య కెరీర్ లో అత్యంత భారీ సినిమా ఇదే అవుతుంది.కాగా ఇందులో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంతనాలను నెలకొన్నాయి.కాగా సాయి పల్లవి నాగచైతన్య మరోసారి ఈ సినిమాతో జంటగా నటించబోతున్న విషయం తెలిసిందే.