అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు.
నాగార్జున ‘ది ఘోస్ట్'( The Ghost ) సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చారు.నాగార్జునతో పాటు ఆయన కొడుకులకు కూడా ఇదే పరిస్థితి.
దీంతో గత కొన్ని రోజులుగా అక్కినేని హీరోలకు( Akkineni Heroes ) బ్యాడ్ టైం నడుస్తుంది.ఇక నాగ్ నెక్స్ట్ సినిమాను చాలా రోజుల వరకు ప్రకటించలేదు.కానీ ఇటీవలే తన పుట్టిన రోజు నాడు కొత్త సినిమాను అనౌన్స్ చేసారు.”నా సామిరంగ”( Naa Saami Ranga ) అనే టైటిల్ తో నాగార్జున ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఈ టీజర్ ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంది.
నాగ్ ఈ సినిమా కోసం మాస్ మేకోవర్( Mass Role ) లోకి మారి పోయాడు.
ఈ మేకోవర్ ఫ్యాన్స్ ను బాగా అలరించింది.చాలా రోజుల తర్వాత నాగ్ సినిమా ప్రకటించిన రోజే భారీ హైప్ తెచ్చుకుంది.
ఇక 2024 సంక్రాంతి బరిలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అని ఆ రోజే ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు.మరి ఈ సినిమా అప్పటి నుండి మరింత వేగంగా దూసుకు పోతుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
తాజాగా ఈ సినిమా షూట్( Naa Saami Ranga Movie Shooting ) గురించి ఒక అప్డేట్ తెలుస్తుంది.ఈ సినిమా కోసం యూనిట్ మొత్తం కలిసి గేయ రచయిత చంద్రబోస్ తో సాలిడ్ నంబర్ ను డిజైన్ చేస్తున్నారని సమాచారం.ఇక ఈ వారంలోనే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తున్నట్టు నాగ్ కూడా ఈ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి ఈ సినిమాను అన్ని వైపులా నుండి పూర్తి చేస్తూ ముందుకు వెళుతున్నారు.