హెయిర్ ఫాల్ సమస్యతో బాగా విసిగిపోయారా.? ఎన్ని విధాలుగా ప్రయత్నించిన జుట్టు రాలడం ఆగట్లేదా..? రకరకాల హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా ఫలితం ఉండట్లేదా.? అయితే అస్సలు చింతించకండి.మీకు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.మరియు బట్టతలపై కూడా జుట్టు మొలుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, ( Kalonji Seeds )వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అందులో వేసి చిన్న మంటపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న ఆయిల్ ను అప్లై చేసుకోవాలి.
ఆపై కనీసం పది నిమిషాలైనా వేళ్ళతో హెడ్ మసాజ్ చేసుకోవాలి.

నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే కనుక తలలో రక్త ప్రసరణ మెరుగ్గా సాగుతోంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.
పల్చటి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఈ ఆయిల్ ను వాడితే బట్టతలపై సైతం జుట్టు మొలుస్తుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో ( Hair fall )సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.