ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్ కు బాబు అప్పగించారేమోనని తెలిపారు.
విడివిడిగా ఉన్నట్లు ఇంతకాలం పవన్ కల్యాణ్ నటించారని సజ్జల పేర్కొన్నారు.ఏపీలో అధికార పార్టీ వైసీపీ పట్ల ప్రజలకు సానుకూలత ఉందని చెప్పారు.
రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డూప్ అన్నారు.టీడీపీ, జనసేన పొత్తుతో కలిసి వచ్చినా వైసీపీకి నష్టం ఏం లేదన్నారు.
యుద్ధానికి సిద్దంగా ఉన్నామన్న సజ్జల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వైసీపీకే ప్రజలు మరోసారి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
.