Silk Smitha : 14 ఏళ్లకే పెళ్లి.. అవి భరించలేక చివరికి అలా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి జీవితం?

దివంగత నటి సిల్క్ స్మిత గురించి ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పాట బావలు సయ్యా.

 Silk Smitha Married At 14 And Her Family Financial Struggles-TeluguStop.com

మరదలు సయ్యా.ఇప్పటికీ అనేక ఫంక్షన్లలో, ఈవెంట్లలో ఈ పాట వినిపిస్తూ ఉంటుంది.

భౌతికంగా ఈమె మనకు దూరమైనప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.కాగా సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.

ఈమె ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించింది.మొదట తమిళ సినిమాలతో కెరీర్ ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగు మలయాళం కన్నడ హిందీ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

Telugu Silk Smitha, Silksmitha-Movie

ఐటమ్ సాంగ్స్ లో చిందులు వేసి తన అందంతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.అయితే మొదట సిల్క్ స్మిత సహాయ నటిగా కెరీర్ ప్రారంభించింది.ఆ తర్వాత 1979లో తమిళ చిత్రం వండిచక్రంలో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.అలా సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్ల ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది.

సెప్టెంబర్ 23, 1996న 35 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.ఆమె దాదాపు 450 చిత్రాల్లో నటించింది.కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో బాల్యంలోనే చదువు వదిలేయాల్సి వచ్చింది.సిల్క్ స్మితకు 14 ఏళ్లకే పెళ్లి జరిగింది.

అయితే పెళ్లి తర్వాత సిల్క్ స్మితకు భర్త, అత్తమామలు వేధింపులు ఎక్కువయ్యాయి.వీటన్నింటిని భరించలేక ఆమె ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది.

Telugu Silk Smitha, Silksmitha-Movie

భర్త ఇంటి నుంచి మేకప్ ఆర్టిస్ట్ అయిన తన స్నేహితురాలి వద్దకు వెళ్లింది.తన స్నేహితురాలితో కలిసి సినిమా సెట్స్‌కి వెళ్లి మేకప్ కళను నేర్చుకుంది.కొన్ని నెలలకే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది.ఆ సమయంలో చిత్ర దర్శకుడు ఆంథోనీ ఈస్ట్‌మన్ ఆమెకు ఒక చిత్రంలో అవకాశమిచ్చాడు.అదే సిల్క్ స్మిత జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

ఆ తర్వాత తమిళ దర్శకుడు విను చక్రవర్తి సిల్క్ స్మితకు నటన, డ్యాన్స్, ఇంగ్లీష్ నేర్చుకునేలా ఏర్పాట్లు కూడా చేశాడు.అప్పటి నుంచి సిల్క్ స్మిత తన కెరీర్‌లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

స్టార్‌ హీరోల సినిమాలలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి.ఒక్క తెలుగు భాషలోనే కాకుండా మలయం కన్నడ,తమిళం, హిందీలో కూడా ఐటెం సాంగ్స్ చేసింది.

Telugu Silk Smitha, Silksmitha-Movie

కెరిర్ పరంగా ఆమె జీవితం సంతోషంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదని చెప్పవచ్చు.ఆ తర్వాత ఆమె ఒక వైద్యుడిని వివాహం చేసుకొని ఆమె సంపాదన మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టిందట.కానీ నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కోల్పోయిందట.కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సిల్క్ స్మిత సెప్టెంబరు 23, 1996న ఓ హోటల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది.

అప్పట్లో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.అయితే అందులో సిల్క్ స్మిత తన జీవితం సంతోషంగా లేదని నమ్మినవారే మోసం చేశారంటూ అందుకే ఈ లోకాన్ని విడిచివెళుతున్నట్లు రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube