స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scheme ) లో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబుకు ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది.ఇప్పటికే వివిధ పార్టీల నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
ఇండియా కూటమితో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు ను అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పడుతూ స్టేట్మెంట్లు ఇచ్చారు.ఇక కొన్ని నేషనల్ మీడియా ఛానళ్లు కూడా చంద్రబాబుకు పరోక్షంగా మద్దతు తెలుపుతూ , అనుకూల కథనాలు ప్రచారం చేస్తున్నాయి.
ఇక ఏపీ తెలంగాణలోని వామ పక్ష పార్టీలు చంద్రబాబు అరెస్టును తప్పుపట్టాయి.ఇక బిజెపిలోని కొంతమంది నాయకులు చంద్రబాబుకు మద్దతుగా నిలబడగా, కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
ఈ విధంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని కీలక నాయకుల మద్దతు చంద్రబాబుకు లభిస్తోంది.

సరైన ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని , ఇదంతా కక్షపూరిత చర్య అని చర్చ ఒకవైపు జరుగుతుండగానే , ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో కీలకంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్( PV Ramesh ) సైతం ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు .స్కిల్ డెవలప్మెంట్ లో కీలకంగా ఉన్న డిజైన్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ కన్వెల్కర్ వంటి వారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మోసం లేదని, ఇది క్లీన్ అండ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు.ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిఐడి రిపోర్ట్ రెండు తప్పే అని, ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చు ప్రోడక్ట్ అండ్ సర్వీసులకు సంబంధించి మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని , ఎవరైనా పరిశీలించుకోవచ్చు అని చెబుతున్నారు.

ఈ విధంగా చంద్రబాబుకు సానుకూలంగానే పరిస్థితులు ఉండగా, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM ys jagan ) మాత్రం చంద్రబాబును అషామాషిగా వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో ఉన్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు, అమరావతి భూములు, ఫైబర్ నెట్, నీటి పారుదల రంగం,, కార్మిక శాఖ తదితర విభాగాల్లో చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న నిధుల తరలింపు వ్యవహారాల పైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారట.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్, టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు వంటి వారు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో, వాటికి సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని ,అవసరమైతే వారిని కూడా అరెస్టు చేయించాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట.