వినడానికి విడ్డూరంగా వున్నా మీరు విన్నది అక్షరాలా నిజం.ఈ ప్రపంచంలో మనకు అప్పుడప్పుడూ వింతలు విడ్డూరాలు అనేవి కనిపిస్తాయి, వినిపిస్తాయి.
ఇక వాటిని చూసిన తరువాత ఆశ్చర్యపోవడం మానవంతు అవుతుంది.తాజాగా ఇలాంటి ఘటన గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అవును, ఓ భవంతిలోని 5వ అంతస్తులో ఏకంగా పెట్రోల్ బంక్( Fifth Floor Petrol Bunk ) ఏర్పాటు చేయడం ఇపుడు అందరినీ అవాక్కయేలా చేస్తోంది.ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఒక వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేయగా అదికాస్త వెలుగు చూసింది.
అయితే ఇది మనదగ్గర జరిగిన వింత కాదండోయ్.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్ చైనాలోని చాంగ్‌కింగ్( Chongqing China )లో నిర్మితమయ్యింది.పెట్రోలు బంక్‌కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని ఇక్కడ మనం వీడియోలో చూడవచ్చు.
నిజానికి ఈ భవనం తక్కువ ఎత్తులోనే వున్నప్పటికీ కొండ ప్రాంతం కావడంతో అది మరింత ఎత్తులో వున్నట్టు కనబడుతోంది.జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ భవనం ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో మార్గం ఉంది.
ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్ బంక్‌కు చేరుకోగలుగుతారన్నమాట.
కాగా చైనావాసులు( Chinese ) ఆ పెట్రోల్ బంకు గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతారని తెలుస్తోంది.ఎందుకంటే ఈ భవన్తి కూడా అక్కడ స్తనిక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుందని వారంతా భావిస్తారట.నిజంగా సూపర్ కదూ.వాస్తవానికి అక్కడ పెట్రోల్ బంకు పెట్టడానికి అవకాశమే లేదట.అలాంటి కస్టమైన ప్లేసులో కూడా చైనా ఆ విధంగా బంకుని నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఈ క్రమంలో చాలామంది నెటిజన్లు చైనాని ఆకాశానికేత్తెస్తున్నారు.కావాలంటే ఇక్కడ వీడియోని మీరు ఒక్కసారి పరిశీలించండి.