Junior NTR : మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. చనిపోయే ముందు అలా ఫీల్ కావద్దంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Junior Ntr Made Shocking Comments About The Death-TeluguStop.com

అంతేకాకుండా నటన, డాన్స్ ఇలా అన్నింటిలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు.అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చాలా దేశాలలో విపరీతమైన క్రేజీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది.

గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR movie )తో ఈ విషయం నిరూపితం అవ్వడంతో పాటు ఆ సమయంలో తారక్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

Telugu Devara, Ntr, Rrr, Tollywood-Movie

ఇకపోతే తారక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా( Devara Movie )లో నటిస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Devara, Ntr, Rrr, Tollywood-Movie

మరణం విషయం గురించి తారక్ స్పందిస్తూ.మరణం అన్నది నా రెండో జన్మగా భావిస్తాను.అందుకే నేను నా భార్య లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) పుట్టినరోజున 26 ఇంట్లో రెండు పుట్టినరోజులు జరుపుకుంటాము అని తెలిపారు.

పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడైనా మరణానికి చేరువ కావాల్సిందే, ఆశ అనే చిన్న రేఖ పైన బతుకుతున్నాము.ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.

నా కోరిక ఒక్కటే చనిపోయే ముందు క్షణం కూడా గిల్టీగా ఫీలవకూడదు అని చెప్పుకొచ్చారు తారక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube