ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ Honor భారత మార్కెట్లోకి Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 14న విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.ఈ స్మార్ట్ ఫోన్ Honor అధికారిక వెబ్సైట్ తో పాటు ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో( Amazon ) అందుబాటులోకి రానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్, ధర వివరాలు ఏమిటో చూద్దాం.Honor 90 5G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో వస్తుంది.
ఈ ఫోన్ లో 200 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిన్ కెమెరా ఉంటుంది.సెల్ఫీల కోసం 50 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరా తో( Front Camera ) వస్తుంది.120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200*2664 పిక్సెల్స్ ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే సొంతం.ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ తో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.66వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ తో వస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 12GB RAM+256GB స్టోరేజ్, 16GB RAM+256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.12GB RAM+256GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.29000 గా ఉంది.16GB RAM+256GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.32680 గా ఉంది.అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధరలు చైనా మార్కెట్ లో విడుదల చేసినవి.భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధరల విషయంలో ఏవైనా మార్పులు ఉంటాయా.
లేదా అనేది వేచి చూడాల్సిందే.