విజయ్ దేవరకొండ,( Vijay Deverakonda ) సమంత జంటగా నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యం లో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండకు సక్సెస్ దక్కింది.కరోనాకు ముందు గీత గోవిందం( Geetha Govindam ) మరియు అర్జున్ రెడ్డి సినిమా లతో సక్సెస్ ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ అప్పటి నుండి మొన్నటి లైగర్ వరకు వరుసగా ఫ్లాప్స్ నే చవిచూడటం జరిగింది.
రౌడీ స్టార్ క్రేజ్ తగ్గుతుంది అనుకుంటూ ఉన్న సమయం లో అనూహ్యంగా ఖుషి సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు.

అంతా బాగానే ఉందని రౌడీ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ వార్ కి తెర తీయడం జరిగింది.ఖుషి సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం కూడా సమంత( Samantha ) దే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఆమె లేకుండా ఉంటే ఈ సినిమా ఉండేది కాదని, అసలు కథ మొత్తం కూడా ఆమెదే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రౌడీ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.ఆమె లేకున్నా కూడా ఎవరు ఉన్నా కూడా ఖుషి సినిమా సక్సెస్ అయ్యేది.ఒక వేళ రౌడీ స్టార్ కాకుండా మరే హీరో ఈ సినిమా లో నటించినా కూడా న్యాయం చేసేవారు కాదు.
అందుకే ఖుషి సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం కూడా హీరో విజయ్ దేవరకొండ దే అన్నట్లుగా రౌడీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకు ఖుషి సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిది అంటూ న్యూట్రల్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.మీడియా వారు మాత్రం శివ నిర్వాన( Shiva Nirvana ) చక్కని స్క్రీన్ ప్లే తో సినిమాను రూపొందించడం వల్లే ఖుషి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని అంటున్నారు.
సినిమా అనేది టీమ్ వర్క్ కనుక ఖుషి సక్సెస్ ఏ ఒక్కరిదో కాదు.