Lavanya Tirpathi: గాసిప్ కాలనీగా మారిపోతున్న ఇంటర్నెట్… మెగా కోడలు లావణ్య కామెంట్స్ వైరల్!

అందాల రాక్షసి(Andala Raakshashi)సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tirpathi ) ఇలా మొదటి సినిమాతోనే తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇతర భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Heroine Lavanya Tirpathi Comments Viral On Social Media-TeluguStop.com

ఇలా నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె త్వరలోనే మెగా ఇంటికి కోడలు అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా మెగా కోడలు కాబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి వచ్చే గాసిప్స్( Gossips ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Lavanyatripathi, Law, Varuntej, Varun Tej-Movie

లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో వీరిద్దరూ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.ఇలా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.ఇక ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఇలా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నటువంటి వీరి గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి.

Telugu Lavanyatripathi, Law, Varuntej, Varun Tej-Movie

ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సెలబ్రిటీల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించినటువంటి లావణ్య త్రిపాఠి ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్( Internet ) అనేది ఒక గాసిప్ కాలనీగా మారిపోతుందని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కి చెందిన వారి గురించి కూడ ఇలాంటి గాసిప్స్ వస్తున్నాయని తెలిపారు.అయితే ఈ గాసిప్స్ క్రియేట్ చేసే సమయాన్ని మీరు మీకోసం ఉపయోగించుకోమని సలహా ఇచ్చారు.

Telugu Lavanyatripathi, Law, Varuntej, Varun Tej-Movie

ఒక మనిషిని చూసిన మూడు నిమిషాలలోనే వారి గురించి జడ్జిమెంట్ ఇవ్వడం మానేయండి.మనం ఒకరి గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నాము అంటే మన జీవితం కూడా అలాగే ఉంటుందని అందుకే ప్రతి ఒక్కరూ మంచిగా ఉండండి అంటూ ఈ సందర్భంగా లావణ్య ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.అయితే గత కొంతకాలంగా లావణ్య త్రిపాటి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈమె మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న సందర్భంలోనే వరుణ్ తేజ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటూ లావణ్య గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube