చాలామందికి ట్రావెలింగ్( Travelling ) అంటే బాగా ఇష్టం ఉంటుంది.ఏదైనా కొత్త ప్లేస్‌కి వెళ్లడానికి ఇష్టపడతారు.
మంచి ఆహ్లాదకరమైన, చల్లని వాతావరణాన్ని అందించే పర్యాటక ప్రదేశాలకు తిరుగతూ ఉంటారు.అలాగే దేశ, విదేశాల్లోని ప్రముఖ ప్రదేశాలన్నింటికీ చూడాలనే కోరిక ఉంటుంది.
దీంతో ఖాళీ దొరికినప్పుడల్లా ఏదోక ప్రదేశానికి వెళుతూ ఉంటారు.కొత్త ప్రదేశాలను( New Places ) చూడటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ట్రావెలింగ్ చేయడం వల్ల కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి.
దీంతో ఆఫీసులకు సెలవులు పెట్టి చాలామంది టూరిస్ట్ ప్రదేశాలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
అయితే టూరిస్ట్ ప్రదేశాలకు( Tourist Places ) వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.ట్రావెలింగ్ ఛార్జీలతో అక్కడ ఉంటానికి బస, ఫుడ్ కి చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి.అలాగే విదేశాలకు వెళ్లాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటాయి.దీంతో అంత డబ్బులు లేనివారు చిన్న చిన్న ప్రదేశాలకు వెళుతూ ఉంటారు.
అయితే బాగా డబ్బు సంపాదించడంతో పాటు వాటిని దాచుకోని ప్రపంచమంతా చుట్టేయాలని చాలామందికి ఉంటుంది.అందుకోసం చాలామంది డబ్బులు ఆదా చేసుకుంటూ ఉంటారు.ట్రావెలింగ్ కోసం డబ్బులు ఆదా చేసుకోవడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది బెస్ట్ ఆప్షన్.
ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్‌లలో( Mutual Funds ) డబ్బులు దాచుకోవాలి.దీని వల్ల మీకు మంచి ఆదాయం వస్తుంది.నెల నెల కొంతవరకు ఆదా చేసుకోవాలి.
తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది.రూ.500 నుంచి ఎంతవరకు అయినా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.మీకు అవసరమైనప్పుడు ఈ డబ్బులను వెంటనే విత్ డ్రా చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి ప్లాన్ ను ఎంచుకోవాలి.సొంతంగా రీసెర్చ్ చేసి అధిక ఆదాయం వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకోండి.
ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకోండి.