పచ్చదనం పరిడవిల్లేలా మొక్కలు నాటి సంరక్షించాలి 15 రోజుల్లో బైపాస్ ల సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తి చేయాలిసిరిసిల్ల( Sirisilla ) పురపాలక సంఘం పరిధిలో రెండు బైపాస్ లలో 15 కిలో మీటర్ల మేర అవెన్యూ, విభాగినీ ప్లాంటేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి( Anuradha Jayanti ) మున్సిపల్ అధికారులు ఆదేశించారు.పచ్చదనం పరిరవిల్లెల మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు.
గురువారం సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ,ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారుఇప్పటి వరకు బై పాస్ అవెన్యూ, విభాగినీ లలో నాటిన మొక్కల ఎత్తు పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ప్లాంటేషన్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు పీరియాడికల్ గా విజిట్ చేయాలన్నారు.రూ.3 కోట్ల 10 లక్షల రూపాయలతో తెలంగాణ స్మారకంగా తీర్చిదిద్దనున్న రగుడు జంక్షన్ ను వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.జంక్షన్ అభివృద్ధికి సంబంధించి ప్రతి వారం వారీగా పూర్తి చేయాల్సిన కాంపోనెంట్ పనులపై కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.
రెండవ బైపాస్ లో రూ.7 కోట్ల 10 లక్షల రూపాయలతో చేపడుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను పక్షం రోజుల్లో గా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.శాంతినగర్ ,రగుడు, పెద్దూరులో ఇప్పటికే పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలి అన్నారు.
మొక్కలను చిక్కగా నాటి పచ్చదనం పెంపొందించాలన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2 కోట్ల తో చేపడుతున్న గ్రౌండ్ అభివృద్ధి పనులను వచ్చే దసరా కల్లా పూర్తి చేయాలన్నారు.హైదరాబాదులోని ఎల్బి స్టేడియం( LB Stadium ) మాదిరి గ్రౌండ్ లో నిర్దేశిత క్రికెట్ మైదానంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
వీక్షకుల గ్యాలరీ పై టాప్ రూప్ ఏర్పాటు చేయాలని చెప్పారు.టీఎస్ బిపాస్ పెండింగ్ దరఖాస్తులను సరిత గతిన పరిష్కరించాలన్నారు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎక్కడైనా డెంగ్యూ కేసులు నమోదైతే ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు డెంగ్యూ కేసులు నమోదైన ఇంటితోపాటు వాటి పరిసర ఇండ్లలో డెంగ్యూ నివారణ చర్యలను చేపట్టాలన్నారు.
రెండు పడక గదుల ఇండ్ల అర్హుల జాబితాలో పేరు ఉండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం మంజూరులో ప్రాధాన్యత నివ్వాలన్నారు.రూ.6 కోట్ల 21 లక్షలతో వెంకంపెట దోభి ఘాట్ నుండి కొత్త చెఱువు వరకు నిర్మిస్తున్న వర్ష వాటర్ డ్రైన్ ను, రూ.6 కోట్ల 97 లక్షల రూపాయలతో నిర్మించనున్న బైపాస్ రోడ్డు ల అనుసంధాన సీసీ రోడ్లు, డ్రైన్ లు వచ్చే దసరా లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఇంజనీర్ ఆదేశించారు.వీకెండ్ ఎస్ హెచ్ జి మార్కెట్ కు ఏర్పాట్లు చేయండి
సిరిసిల్ల పట్టణం బతుకమ్మ ఘాటు వద్ద వార స్వయం సహాయక సంఘ సంత ( వీకెండ్ ఎస్ హెచ్ జి మార్కెట్ ) కు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాజయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపులను సిద్ధం చేసి తాత్కాలిక ప్రాదికన స్వయం సహాయ సంఘాలకు అద్దెకి ఇవ్వాలన్నారు.
వారంలో ఒకరోజు సంతలో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు, వంటకాలు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.తద్వారా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు మున్సిపాలిటీకి ఆదాయం చేకూరుతుందన్నారు.
ప్రజలకు రిఫ్రెష్మెంట్ లభిస్తుందన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అయాజ్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్, డి ఈఈ ప్రసాద్ , ఏఈఈ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు
.