విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో రాబోతున్న లవ్ రొమాంటిక్ మూవీ ఖుషి (Khushi) సెప్టెంబర్ 1న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రతి ఒక్కటి అందర్నీ ఆకట్టుకున్నాయి.
మరీ ముఖ్యంగా యూత్ ఈ సినిమా చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి అని కూడా సినిమా ట్రైలర్, పాటలు చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ చూసినా కొంతమంది అక్కినేని అభిమానులు కుళ్లుకున్నప్పటికీ సమంత అభిమానులు మాత్రం ఈ సినిమా చూస్తే నాగచైతన్య (Naga Chaithanya) ఎంతగా హర్ట్ అవుతారో అని కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఈ సినిమాలో సమంతకి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కి మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట.మరీ ముఖ్యంగా ఈ సన్నివేశాల గురించి సమంతకి మొదట్లో డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పలేదట.కొన్ని మాత్రమే అలాంటి సన్నివేశాలు ఉంటాయని చెప్పినప్పటికీ షూటింగ్ టైంకి వచ్చేసరికి ఇక్కడ ఈ సీన్ పెడితే బాగుంటుందని అంటూ ఒక్కొక్క సన్నివేశాన్ని పెంచుకుంటూ పోయారట.
మరీ ముఖ్యంగా బెడ్రూమ్ సీన్స్ లో సమంత (Samantha) నటించడానికి ససేమిరా అని చెప్పిందట.
కానీ శివ నిర్వాణ మాత్రం ఈ సినిమాకి ఇవే హైలెట్స్ సన్నివేశాలు అవుతాయని, కచ్చితంగా ఈ సన్నివేశంలో నువ్వు నటించాలి అని సమంతను విజయ్ దేవరకొండ తో కలిసి చేసే బెడ్రూం సన్నివేశానికి బలవంతంగా ఒప్పించారట డైరెక్టర్.అయినప్పటికీ సమంత మాత్రం మొదట్లో ఆ సన్నివేశం చేయనని ఎంతగా మొత్తుకున్నప్పటికీ డైరెక్టర్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టి మరీ ఈ సీన్ కి ఒప్పించాడట.ఇలా డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) వల్లే సమంత ఇందులోని కొన్ని సన్నివేశాలకు ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరి ఈ సన్నివేశాలను చూసి నెటిజన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ముందు ముందు చూడాలి.