అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో ప్రస్తుతం అల్లు అర్జున్( Allu arjun ) పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది అంతేకాదు.టాలీవుడ్ నుండి మొదటిసారి ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అల్లు అర్జున్ కంటే ముందే టాలీవుడ్ లో మరో హీరో రెండుసార్లు నేషనల్ అవార్డు అందుకున్నారట.మరి ఆ హీరో ఎవరు.
ఎందుకు ఆయన పేరు ప్రస్తావించడం లేదు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ అవార్డు అందుకున్న హీరో అక్కినేని నాగార్జున…అవును అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) టాలీవుడ్ నుండి రెండుసార్లు నేషనల్ అవార్డు అందుకున్నారట.
కానీ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఈయన ఉత్తమ నటుడిగా కాకుండా నేషనల్ అవార్డ్స్ లో ఏ కేటగిరిలో అవార్డ్ అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందామా.అక్కినేని నాగార్జున అన్నమయ్య( Annamayya ) సినిమాలో ఎంతలా ఒదిగిపోయి నటించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే ఈ సినిమాకి గానూ అక్కినేని నాగార్జునకి స్పెషల్ మెన్షన్ కేటగిరీలో అవార్డు లభించిందట.
అలాగే నాగార్జున టబు కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా ( Ninne Pelladata ) సినిమా కూడా సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఈ సినిమాకి కూడా నాగార్జునకి బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు కేటగిరిలో నాగార్జున రెండోసారి జాతీయ అవార్డు అందుకున్నారు.అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.
ఎందుకంటే ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ మాత్రమే.కానీ నాగార్జున వివిధ కేటగిరీల్లో అవార్డ్స్ అందుకున్నారు.
ఇక నాగార్జున నేషనల్ అవార్డు అందుకున్న విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు.ఒకప్పటి స్టార్ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్( ANR ) వంటి హీరోలతో కానిది అల్లు అర్జున్ తో అయ్యింది అని చాలామంది అల్లు అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.