ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పుష ది రైజ్ సినిమాతో అవార్డ్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.తన టాలెంట్ తో బన్నీ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.
కొన్నిరోజుల క్రితం బన్నీ కెరీర్ గురించి వేణుస్వామి పాజిటివ్ కామెంట్లు చేయడంతో పాటు పుష్ప2 ( Pushpa 2 )విషయంలో అనుకూలంగా జరుగుతుందని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.బన్నీ జాతకం విషయంలో వేణుస్వామి ( Venuswamy )మాటలు నిజమవుతున్నాయి.
పుష్ప2 సినిమా( Pushpa 2 )తో బన్నీ 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమా సినిమాకు బన్నీ రేంజ్ పెరుగుతుండగా బన్నీ పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ ను రూల్ చేయడంతో పాటు ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు.బన్నీ గొప్పదనం గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం బన్నీకి ఈ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.తన కష్టాన్ని నమ్ముకుని బన్నీ ముందుకెళుతున్నారని అదే ఆయనకు కెరీర్ పరంగా కలిసొస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాబోయే రోజుల్లో బన్నీ దూకుడుకు బ్రేక్ వేయడం సులువు కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బన్నీని ఆపేదెవరంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.బన్నీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో బాక్సఫీస్ ను రూల్ చేస్తారో చూడాల్సి ఉంది.కథ, కథనం విషయంలో బన్నీ జాగ్రత్త వహించాల్సి ఉంది.వేణుస్వామి చెప్పిన విషయాలు నిజమవుతూ ఉండటంతో జ్యోతిష్కునిగా ఆయన గుర్తింపు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోందని కొంతమంది సోషల్ మీడియా( Social media ) వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వేణుస్వామి ఫీజు కూడా భారీగానే ఉందని సమాచారం అందుతోంది.