ఏపీ సీఎం జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించారు.మెంటాడ మండలం చినమేడపల్లిలో గిరిజన యూనివర్సిటీకి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ గిరిజనులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ రాబోతుందని తెలిపారు.గిరిజనుల విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేసిందన్నారు.
రాజకీయ పదవుల్లోనూ గిరిజనులు ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్ గిరిజన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామని చెప్పారు.గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశామని , గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామని తెలిపారు.
గిరిజనులకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.డీబీటీ, నాన్ డీబీటీతో 58 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,800 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు.