బెల్లీ ఫ్యాట్.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారు.
పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోవడానికి కారణాలు అనేకం.అయితే తగ్గించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు పొట్ట కొవ్వును చాలా వేగంగా కరిగిస్తాయి.అందులో టాప్ 5 గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలు.వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.ఆరోగ్యపరంగా అవిసె గింజలు( Flax seeds ) అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి.ముఖ్యంగా పొట్ట కరిగించడానికి అవిసె గింజలు ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు.
రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలను స్మూతీస్, సలాడ్స్, ఓవర్ నైట్ ఓట్స్, మజ్జిగ( Overnight oats, buttermilk ) ఇలా ఏదో ఒక దానితో కలిపి తీసుకోవాలి.లేదా నేరుగా కూడా అవిసె గింజలను తీసుకోవచ్చు.
తద్వారా కొద్ది రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.
మిరియాలు( Pepper ).బెల్లీ ఫ్యాట్ కు చెక్ పెట్టడానికి గ్రేట్ గా సహాయపడతాయి.రోజుకు నాలుగు మిరియాలను దంచి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.గ్రీన్ టీ( Green tea ).వెయిట్ లాస్ తో పాటు బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడడానికి కూడా సహాయపడుతుంది.రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ ని ఏదో ఒక సమయంలో తీసుకోండి.
దాంతో బాన పొట్టకు బై బై చెప్పవచ్చు.
పసుపు.ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలపరచడానికి మాత్రమే కాదు పొట్ట వద్ద కొవ్వు ను నిరోధించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.అందుకే బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు పసుపును నిత్యం తీసుకోవాలి.
ఇక దాల్చిన చెక్క కూడా పొట్ట కొవ్వును ఇట్టే కరిగిస్తుంది.రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే ఎలాంటి బాన పొట్ట అయినా దెబ్బకు కరిగిపోద్ది.