ఏపీలో పథకాలు అందని లబ్ధిదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.ఇందులో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు.ఈ మేరకు 2,69,169 మంది లబ్ధిదారులకు రూ.216.34 కోట్ల నిధులను ఆయన జమ చేశారు.దరఖాస్తు చేసుకున్న వారు అర్హులు అయితే సంక్షేమ పథకాలు ఇస్తామని సీఎం జగన్ తెలిపారు.
కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.ఈ క్రమంలోనే అజమాయిషి అంటే అధికారం కాదన్న సీఎం జగన్ ప్రజలపై మమకారమని చెప్పారు.
కొత్త పెన్షన్, బియ్యం, రేషన్ కార్డులు ఇస్తున్నామన్న సీఎం జగన్ ఏ కారణం వల్లనైనా పథకాలు అందని వారికి మళ్లీ అవకాశం ఇస్తున్నామని తెలిపారు.