రాజమౌళి( Rajamouli ) RRR తర్వాత ఎంతో ప్రతిషాత్మకంగా మహేష్ బాబు( Mahesh Babu )తో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఒక అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.మహేష్ బాబు గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభం చేసుకోబోతుంది.
అయితే తాజాగా ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్( Vinayendra Prasad ) మాట్లాడుతూ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఆఫ్రికా అడవులలో ఓ అడ్వెంచరర్స్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో మేము హాలీవుడ్ యాక్టర్స్( Holly wood Actors ) ని కూడా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నామని విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు.ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనని ఈయన తెలియజేశారు.ఇక ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి కూడా పనిచేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ విధంగా ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఎక్కువ భాగం ఆఫ్రికాలోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభించక ముందే ఈ సినిమా గురించి ఇలాంటి అప్డేట్స్ బయటకు రావడంతో సినిమాపై రోజు రోజుకు భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ సినిమాతో రాజమౌళి మరో సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటూ మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.