సినీ నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) త్వరలోనే ఖుషి సినిమా( Khushi Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి నేపథ్యంలో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలలో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను నటించిన పెళ్లిచూపులు, గీతాగోవిందం, అర్జున్ రెడ్డి వంటి సినిమాల నుంచి తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక త్వరలో రాబోతున్న ఖుషి సినిమా కూడా మీ అందరికీ ఇదే సంతోషాన్ని కలిగిస్తుందని, ఈ సినిమాలో నటి సమంతతో( Samantha) కలిసి నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అంటూ విజయ్ దేవరకొండ తెలియజేశారు.ఇక తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారని అయితే జాతీయస్థాయిలో సూపర్ స్టార్ గా ఎదిగిపోతున్నటువంటి వారిలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఒకరని తెలిపారు.
ఈయనకు జాతీయస్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉందని ఆయన క్రేజ్ చూస్తుంటే తనని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది అంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా అనిరుద్( Anirudh Ravichander ) గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలాంటి ఒక సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్లో తాను కూడా ఒక సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని త్వరలోనే తనతో కలిసి పని చేస్తాను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.