నేటి నుంచి మోకిల ఫేజ్-2 భూముల వేలం

హైదరాబాద్ లోని మోకిల ఫేజ్-2 భూముల వేలం ప్రక్రియకు రంగం సిద్ధం అయింది.ఈ మేరకు నేటి నుంచి వేలం ప్రక్రియ ప్రారంభంకానుండగా 300 ప్లాట్లను హెచ్ఎండీఏ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.

 Mokila Phase-2 Land Auction From Today-TeluguStop.com

ఐదు రోజులపాటు 60 ప్లాట్ల చొప్పున మోకిల ఫేజ్-2 భూముల వేలం కొనసాగనుంది.ఈ క్రమంలో కనిష్ట ధర చదరపు గజానికి రూ.25,000 నిర్ణయించింది హెచ్ఎండీఏ.ఈనెల 21 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పించిన హెచ్ఎండీఏ మొత్తం 98,975 గజాల అమ్మకంతో రూ.800 కోట్లు రావొచ్చని అంచనా వేస్తుంది.మోకిల ప్లాట్లకు సంబంధించి తొలి విడత వేలం ప్రక్రియలో గరిష్టంగా గజానికి రూ.1.05 లక్షలు పలుకగా కనిష్టంగా గజానికి రూ.75 వేలు పలికింది.అదేవిధంగా మొదటి విడతలో గజానికి ప్రభుత్వానికి సరాసరిగా రూ.80,397 లకు పైగా ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube