గ్రేటర్ నోయిడా నివాసి రీసెంట్‌గా మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్( Mahindra XUV400 ) కారును కొన్నాడు.ఈ కారును ఇంట్లో ఛార్జ్ చేయడానికి 10kW కనెక్షన్ అవసరం, ఇది చాలా ఖరీదైనది.
దానివల్ల అతడు ఫస్ట్ నుంచే ఇబ్బందిని ఎదుర్కొన్నాడు.కొద్ది రోజుల తర్వాత కారు కంపెనీ చెప్పినట్లు రేంజ్‌ను అందించడం లేదని తెలుసుకున్నాడు.
కారు యజమాని మహీంద్రాను పలుమార్లు సంప్రదించాడు, కానీ సమస్యలను కంపెనీ పరిష్కరించలేదు.చివరకు విసుగు చెందిన యజమాని కారును చెత్త కుండీగా మార్చాడు.
ఆ పని కూడా సంస్థ షోరూం వద్దే చేశాడు.అనంతరం నిరసన ప్రారంభించాడు.
మహీంద్రా ఇప్పటికీ ఈ ఘటనపై స్పందించలేదు.వివరాల్లోకి వెళ్తే.
సదరు కారు యజమాని చెబుతున్న ప్రకారం మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారును ఇంట్లో ఛార్జింగ్ చేయడానికి 10kW కనెక్షన్ అవసరం అవుతుందట.ఇంట్లో కాకుండా ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జ్ చేసుకోవడానికి మినిమమ్ రూ.1000 ఖర్చు అవుతుందట.అయితే, ఇంత ఖర్చు పెట్టినా కారు కేవలం 150 కి.మీ రేంజ్‌ను మాత్రమే ఇస్తుందట.సంస్థ మాత్రం 300 నుంచి 350 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని చెప్పింది.
ఈ విషయాన్ని కారు యజమాని సంస్థకు తెలియజేసినప్పటికీ, సంస్థ ఏమీ పరిష్కరించలేదు.దీంతో విసుగు చెందిన కారు యజమాని ఘజియాబాద్( Ghaziabad )లోని సంస్థ షోరూం వద్ద కారును చెత్త కుండీగా మార్చి నిరసన ప్రారంభించాడు.మహీంద్రా XUV400 గురించి కంపెనీ తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని, మహీంద్రా XUV400 రేంజ్ చూసి మోసపోకండని, మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారును కలిగి ఉండటం వల్ల హిడెన్ కాస్ట్స్ ఎక్కువతాయని సదరు యజమాని ఆరోపణలు చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.కొందరు కారు యజమానిని మద్దతు ఇస్తున్నారు.కొందరు కారు యజమానిని విమర్శిస్తున్నారు.కారు యజమాని తప్పు చేశాడని కొందరు భావిస్తున్నారు.కారును సరిగా హ్యాండల్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని వారు అంటున్నారు.మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో 350 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని మహీంద్రా పేర్కొంది.XUV400 కారు మోటార్ 147.51bh పవర్, 310Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 50 నిమిషాల సమయం పడుతుంది.దీని ప్రారంభ ధర రూ.15.99 లక్షలు.