ప్రెగ్నెన్సీ టైంలో తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన 8 ఆహారాలు ఇవే!

పెళ్లి తర్వాత ప్రతి మహిళ అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతూ ఉంటుంది.మహిళలకు మాతృత్వం అనేది ఒక వారం.

 These Are The 8 Foods That Must Be Taken During Pregnancy! Pregnancy, Women, Hea-TeluguStop.com

అయితే ప్రెగ్నెన్సీ( Pregnancy ) సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎన్నో ఆహార నియమాలు పాటించాలి.

మామూలు సమయంతో పోలిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యం పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలి.అలాగే కడుపులోని బిడ్డకు తల్లికి అవసరమయ్యే పోషకాలను అందించాలి.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో తల్లి బిడ్డ( Mother child ) ఆరోగ్యంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా ఎనిమిది ఆహారాన్ని తీసుకోవాలి.ఆ ఎనిమిది ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళ నిత్యం గుప్పెడు నట్స్ తీసుకోవాలి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో నట్స్ తీసుకోవాలి.ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.అతి ఆకలిని దూరం చేస్తాయి.

అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో వారానికి ఒక్కసారి అయినా సీ ఫుడ్ ను తీసుకోవాలి.సీ ఫుడ్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ బిడ్డ మెదడు మరియు నెర్వస్ సిస్టం డెవలప్మెంట్ తోడ్పడతాయి.

Telugu Foods, Tips, Healthy Foods, Latest, Pregnancy, Pregnant-Telugu Health

గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఒక కప్పు పెరుగును ఖ‌చ్చితంగా తీసుకోవాలి.పెరుగులో ఉండే కాలుష్యం తల్లి బిడ్డ ఎముకల ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.ఒక ఉడికించిన గుడ్డును ప్రెగ్నెన్సీ టైంలో తప్పకుండా తీసుకోండి. గుడ్డు( eggS ) లో ఉండే ప్రోటీన్ మరియు అమైనో యాసిడ్స్ బేబీ బ్రెయిన్ గ్రోత్ కు హెల్ప్ చేస్తాయి.

Telugu Foods, Tips, Healthy Foods, Latest, Pregnancy, Pregnant-Telugu Health

ఓట్స్ కూడా ప్రెగ్నెంట్ మహిళలకు ఎంతో మేలు చేస్తాయి.ఓట్స్ ను డైట్ లో చేర్చుకుంటే తల్లులు ఎక్కువ సమయం పాటు ఎనర్జిటిక్ గా ఉంటారు.తరచూ ఆకలి వేయడం తగ్గుతుంది.పప్పు ధాన్యాలు, ఆకు కూరలు( Leafy vegetables ) అవకాడో వంటి ఆహారాల‌ను కూడా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

వీటిలో ఉండే పోషకాలు తల్లి బిడ్డ ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube