ఏపీ సీఎంవోలోని కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు.
ఈ సంతకాలతో నిందితులు సీఎం పిటిషన్ ను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.డిజిటల్ సంతకాలను ఉపయోగించి సంబంధిత శాఖలకు ఫైళ్లను పంపినట్లు రుజువైంది.అదేవిధంగా ఒక్కో ఫైల్ కి రూ.30 నుంచి రూ.50 వేల వరకు వసూళ్లకు పాల్పడ్డారని సీఐడీ నిర్ధారించింది.సుమారు మూడు నెలల కాలంలో రూ.15 లక్షల వరకు వసూల్ చేసినట్లు నిర్దారించారు.ఈ మేరకు ఐదుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.