సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) 72 ఏళ్ల వయసులో కూడా తనదైన శైలిలో దూసుకు పోతున్నాడు.గత దశాబ్దంగా సూపర్ హిట్ అనేది లేకపోయినా ఈయన వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరించాలని కష్టపడుతున్నారు.
మరి సూపర్ స్టార్ రజినీకాంత్ కష్టం ఇన్నాళ్లకు ఫలించి ఆయన నటించిన కొత్త సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది.రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్”.
ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాపై ముందు నుండి భారీ హైప్ నెలకొనగా దానికి తగ్గట్టుగానే ప్రీమియర్స్ నుండే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
సూపర్ స్టార్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో వచ్చాడు.
చాలా కాలంగా హిట్ లేక బాధ పడుతున్న రజినీకాంత్ కు జైలర్ సినిమా( Jailer ) ఊపిరి పోసింది.ఈ సినిమా మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా కుమ్మేసాయి.మొదటి రోజు మాత్రమే కాదు ఈ సినిమా రెండవ రోజు కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది.వరల్డ్ వైడ్ గా 122.50 కోట్ల బిజినెస్ చేయగా 123 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది.
జైలర్ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 95.78 కోట్లు రాబట్టి సూపర్ స్టార్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు.ఇక రెండవ రోజు కూడా ఇదే ఊపుతో 50 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.తెలుగులో మెగాస్టార్ భోళా( Bhola Shankar ) ఉన్న కూడా రెండవ రోజు 6 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకు పోతుంది.