గ్లోబల్ స్టార్ అనే బిరుదు పెట్టుకుంటే రాదు.. ఆది కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా రాంచరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్న విషయం పట్ల తాజాగా హైపర్ ఆది( Hyper Aadi ) చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

 If You Give The Title Of Global Star, It Will Not Work, Hyper Aadi, Global Star,-TeluguStop.com

హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమాలో కూడా నటించారు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Telugu Bhola Shankar, Chiranjeevi, Hyper Aadi-Movie

ఈ వేడుకలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ( Mega Family ) పై పెద్ద ఎత్తున ప్రశంశాలు కురిపించడమే కాకుండా మెగా ఫ్యామిలీ పై విరుచుకుపడే వారికి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడుతూ ఆయన మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి పేరును మించి ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు.వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నటువంటి రాంచరణ్ పై ఒకానొక సమయంలో ఎంతోమంది విమర్శలు చేశారు.

ఆ సమయంలోనే రంగస్థలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Hyper Aadi-Movie

ఇక నటన విషయంలో ఈయన తన తండ్రి చిరంజీవి గారిని మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని హైపర్ ఆది తెలిపారు.ఇక తాను మెగా ఇంటి నుంచి వారసుడిగా రావడంతో మెగా పవర్ స్టార్ అనే పేరు పెట్టుకున్నారని చాలామంది ఏడుస్తున్నారు అయితే ఈ బిరుదును పెట్టుకున్నప్పటికీ గ్లోబల్ స్టార్ ( Global Star ) అనే బిరుదు మాత్రం ఎవరో ఇస్తే వచ్చినది కాదని, ఇక్కడున్న హీరోలందరినీ తట్టుకుని, వాళ్లందరినీ నెట్టుకుని, చిరంజీవిగారి కొడుకుగా పేరు నిలబెట్టుకుని.ఎంత ఎదిగినా చేతులు కట్టుకుని ఉన్నాడు కాబట్టే ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్ అంటూ రామ్ చరణ్ గురించి హైపర్ ఆది చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube