Bhola Shankar: భోళా శంకర్ సినిమాకి ఆ అమ్మాయిని వద్దని అడిగి మరీ శ్రీముఖిని తీసుకున్న చిరంజీవి.. ఎందుకంటే..?

మరికొద్ది గంటల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్( Bhola shankar ) సినిమా విడుదల కాబోతుంది.ఇక ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Chiranjeevi Took Srimukhi After Asking That Girl For Bhola Shankars Movie-TeluguStop.com

అయితే తాజాగా ఈ సినిమాలో శ్రీముఖి ( Sreemukhi ) పాత్ర కోసం ఓ అమ్మాయిని అనుకుంటే కావాలనే చిరంజీవి ఆ అమ్మాయిని తీసేసి శ్రీముఖిని అడిగి మరీ పెట్టించుకున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.ఇక అసలు విషయం ఏమిటంటే.

భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి చిరంజీవికి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయట.

అయితే కామెడీ సన్నివేశాలు అంటే కామెడియన్ ని పెడితే బాగుంటుంది అని మెహర్ రమేష్ ( Mehar Ramesh ) ఈ పాత్రకి జబర్దస్త్ కమెడియన్ రోహిణి( Jabardasth Rohini ) ని అనుకున్నారట.ఇక ఈ విషయం చిరంజీవి( Chiranjeevi ) కి చెబితే వామ్మో ఆ అమ్మాయా.ఆ అమ్మాయి కామెడీ చేస్తే నేను కూడా ఆశ్చర్య పోవాల్సిందే.

అంతేకాదు ఆ అమ్మాయి కామెడీ ముందు నేను నిలవలేను.

ఆమెతో చాలా కష్టం ఆ ప్లేస్ లో వేరే అమ్మాయిని పెట్టండి అంటూ చిరంజీవి చెప్పారట.దాంతో మెహర్ రమేష్ చిరంజీవి వద్దనడంతో రోహిణి పాత్రలో శ్రీముఖి ని తీసుకున్నారట.కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఆ పాత్రకి రోహిణి మాత్రమే న్యాయం చేయగలదు.

కానీ రోహిణి ని వద్దని శ్రీముఖి ( Srimukhi ) ని తీసుకోవడం వెనుక వేరే ఏదో ఉందని,కావాలనే చిరంజీవి ఆ అమ్మాయిని తీసేసారంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనాప్పటికి చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ ని రోహిణి మిస్ అయింది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube