హీరో అజిత్…ప్రస్తుతం ఇతడి వయసు 51 ఏళ్ళు.పూర్తిగా నెరిసిన జుట్టు మరియు గడ్డం తో విభిన్నమైన లుక్ లో కనిపిస్తూ ఉంటారు.
చిన్నతనం నుంచి రేసింగ్ అంటే మహా ప్రాణం.ఇప్పటికి టైం దొరికితే అదే పని చేస్తుంటారు.1990 లో తమిళ సినిమా అయినా ఎన్ వీడు ఎన్ కనవర్ లో స్కూల్ పిల్లాడిలా చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో కన్పించాడు.ఆ తర్వాత స్పెషల్ క్యామియో లు కూడా చేసాడు.
సరిగ్గా రెండేళ్లకు హీరో గా అమరావతి అనే సినిమాలో నటించాడు.అప్పుడు అతడి వయసు 22.ఇక అక్కడ నుంచి మొదలయిన అజిత్ ప్రస్థానం నేటి వరకు కొనసాగుతనే ఉంది.
ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి దాదాపు హీరో గా 30 ఏళ్ళు గడుస్తున్నాయి.
ఇక 2022 లో వాలిమై చిత్రం తర్వాత తునీవు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హీరో అజిత్ తమిళ సినిమాలోనే కాకుండా యావత్ దక్షిణ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న నటుడు.
ఆయనకు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్ ఉన్నారు.ఇక అజిత్ మిగతా హీరోలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి.
తన ఏజ్ గ్రూప్ స్టార్స్ అంత కూడా 50 ఏళ్ళు వచ్చాయంటే సాధారణంగా వచ్చే ఎన్నో వయసు తాలూకా పరిస్థితులను ఎవరికి కనిపించకుండా మైంటైన్ చేయాలనీ అనుకుంటారు.కానీ అజిత్ మాత్రం అలా కాదు.
నెరిసిన జుట్టుతోనే, గడ్డంతోనే ఉంటాడు.అలాగే అయన మోహంలో సైతం క్యారీ బ్యాగ్స్ చాల స్ప్రష్టం గా కనిపిస్తిన్నప్పటికి దాచుకోవడానికి ఎలాంటి మేకప్స్ చేయదు.
తాను ఎలా ఉన్నానో అలాగే తనని అందరు యాక్సెప్ట్ చేయాలనీ అనుకుంటాడు.ఫ్యామిలీ పరంగా కూడా లౌ ప్రొఫైల్ మైంటైన్ చేయడానికే ఇష్టపడతాడు.ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఎప్పుడు మీడియా ముందుకు రారు.అందుకే అజిత్ కి చాల మంది ఫ్యాన్స్ ఉంటారు.అలాగే తన పేరు తో ఎలాంటి ఫ్యాన్స్ గ్రూప్స్ వద్దని, అసోసియేషన్స్ పెట్టద్దని ఫ్యాన్స్ అందరికి ఓపెన్ లెటర్ రాసాడు.ఫ్యాన్ పేరుతో ఏం చేసిన ఒప్పుకోడు.
అందుకే అజిత్ ని అప్పటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన వారసుడు అంటూ ప్రకటించింది.దట్ ఈజ్ అజిత్.