సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్లలో కూడా రాణిస్తూ ఉంటారు.అంతేకాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు.
ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా హీరో హీరోయిన్లు చేసిన కొన్ని యాడ్స్ నెటిజన్స్ నుంచి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదురయ్యాయి.
పలువురి నెట్టిజెన్స్ హీరో హీరోయిన్లపై ఇదివరకే మండిపడిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా ఆల్కహాల్ కి సంబంధించిన యాడ్స్ లో నటించిన నటీనటులపై విమర్శలను గుప్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన విషయానికి వస్తే.
రష్మిక మందన్న గతంలో చేసిన యాడ్స్ వల్ల కూడా ట్రోలింగ్స్ కు గురైన విషయం తెలిసిందే.
ఒక హిందీ యాడ్ లో భాగంగా ఆమె విక్కీ కౌశల్ అండర్వేర్ మీద చూపును నిలిపివేయడంతో ఆ యాడ్ బాగా విమర్శల పాలయ్యింది.మగవాళ్ళ అండర్వేర్ బ్రాండ్ ప్రమోషన్ యాడ్ లో రష్మిక దర్శకుడు చెప్పిందే చేసి ఉండవచ్చు.
ఆ యాడ్ ఆ కంపెనీ దాని రూపకర్తలు చీప్ టెస్ట్ కు నిదర్శనం.ఇండియాలో మగవాళ్ళ అండర్వేర్ యాడ్లా తరహానే అలా ఉంటుంది.అయితే ఆ యాడ్లో నటించినందుకు రష్మిక బాగా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా రష్మిక మందన మరొక ఆల్కహాల్ యాడ్ లో నటిస్తోంది.
అయితే ఇప్పటికే పలువురు హీరోయిన్లు మందు బ్రాండ్లను ప్రమోట్ చేసే విషయం తెలిసిందే.

ప్రియాంక చోప్రా దీపికా పదుకొనే సమంత లాంటి హీరోయిన్లు ఆల్కహాల్ బ్రాండ్లను ప్రమోట్ చేశారు.ఇప్పుడు రష్మిక వంతు అని చెప్పవచ్చు.అయితే మామూలుగా స్టార్ హీరోలు మద్యం యార్డ్స్ లో నటించినప్పటికీ వారిని ఏమీ అనకుండా హీరోయిన్లు మద్యం బ్రాండ్ ప్రమోషన్స్ లో కనిపిస్తే చాలు వారిపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.
ఆ తరహాలోని తాజాగా రష్మిక మందన చేసిన మద్యం యాడ్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.అంతేకాకుండా ఆమె పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు.







