గ్లోబల్ స్టార్ అనే బిరుదు పెట్టుకుంటే రాదు.. ఆది కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా రాంచరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్న విషయం పట్ల తాజాగా హైపర్ ఆది( Hyper Aadi ) చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమాలో కూడా నటించారు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. """/" / ఈ వేడుకలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ( Mega Family ) పై పెద్ద ఎత్తున ప్రశంశాలు కురిపించడమే కాకుండా మెగా ఫ్యామిలీ పై విరుచుకుపడే వారికి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడుతూ ఆయన మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి పేరును మించి ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు.

వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నటువంటి రాంచరణ్ పై ఒకానొక సమయంలో ఎంతోమంది విమర్శలు చేశారు.

ఆ సమయంలోనే రంగస్థలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు.

"""/" / ఇక నటన విషయంలో ఈయన తన తండ్రి చిరంజీవి గారిని మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని హైపర్ ఆది తెలిపారు.

ఇక తాను మెగా ఇంటి నుంచి వారసుడిగా రావడంతో మెగా పవర్ స్టార్ అనే పేరు పెట్టుకున్నారని చాలామంది ఏడుస్తున్నారు అయితే ఈ బిరుదును పెట్టుకున్నప్పటికీ గ్లోబల్ స్టార్ ( Global Star ) అనే బిరుదు మాత్రం ఎవరో ఇస్తే వచ్చినది కాదని, ఇక్కడున్న హీరోలందరినీ తట్టుకుని, వాళ్లందరినీ నెట్టుకుని, చిరంజీవిగారి కొడుకుగా పేరు నిలబెట్టుకుని.

ఎంత ఎదిగినా చేతులు కట్టుకుని ఉన్నాడు కాబట్టే ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్ అంటూ రామ్ చరణ్ గురించి హైపర్ ఆది చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!