కొన్ని సినిమాలు కొందరి కెరీర్ ని డిసైడ్ చేస్తాయి.ఇప్పుడు ఈ పరిస్థితే భోళాశంకర్ కి వచ్చింది.
ఒకే ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో.ఒకవేళ ఈ సినిమా ప్లాప్ అయితే మాత్రం ఆ ఐదుగురి కెరీర్ డేంజర్ లో పడుతుంది.
ఆ ఐదుగురు ఎవరో కాదు.నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్, హీరో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, సుశాంత్.
అసలు ఒక్క సినిమా వల్ల ఇంత మంది కెరీర్ ఎలా డిసైడ్ అవుతుంది అనుకుంటున్నారా.చలో ఇప్పుడు చూసేద్దాం.
వాల్తేర్ వీరయ్య తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళాశంకర్( Bhola Shankar ).ఈ సినిమాలో తమన్నా, సుశాంత్ నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లలిగా నటిస్తుంది.ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా అందరికి కీలకంగా మారింది.దర్శకుడు మెహర్ రమేష్ షాడో లాంటి డిజాస్టర్ తరువాత ఇండస్ట్రీలో కనిపించలేదు.చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడితేనే మెహర్ రమేష్ కి అవకాశాలు వస్తాయి.లేదంటే ఇండస్ట్రీలో మళ్ళీ ఆయన కనిపించకపోవచ్చు.
దీంతో ఈ సినిమా దర్శకుడికి చాలా ముఖ్యం.

ఇక ఈ సినిమాని నిర్మిస్తున్న అనిల్ సుంకర( Anil Sunkara ) కి కూడా భోళాశంకర్ సినిమా కీలకం కానుంది.ఇప్పటికే అఖిల్ తో చేసిన ఏజెంట్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి షోతోనే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇప్పుడు అనిల్ సుంకర భోళాశంకర్ పైనే ఆశలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా ఒకవేళ ప్లాప్ అయితే త్రం కోలుకోవడం చాలా కష్టం.
ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటివరకు సుశాంత్ కి కెరీర్ కి పెద్ద హిట్ లేదు.
అయినా చిన్న పాత్రలు వస్తూనే ఉన్నాయి.తాజాగా అల్లుఅర్జున్, రవితేజ సినిమాల్లో కనిపించారు.
ఇప్పుడు ఈ భోళా శంకర్ సినిమా హిట్ అయితే మరిన్ని మంచి ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తుంది.జైలర్, భోళా శంకర్ సినిమాలు ఒకే రోజు తేడాలో రెండు రిలీజ్ అవుతున్నాయి.ఈ సినిమాలు తమన్నాకి చాలా కీలకం.
ఇప్పటికే కంపెటేషన్ పెరుగుతుంది.దీంతో తమన్నా( Tamannaah Bhatia )కి కచ్చితంగా ఒక హిట్ సినిమా పడాలి.
ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ సినిమా చాలా ముఖ్యం అనే చెప్పాలి.మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత సైరా, ఆచార్య, గాడ్‌ఫాధర్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
అయితే మెగాస్టార్ గత చిత్రం వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఇదే ఫామ్ ని మెగాస్టార్ కొనసాగించాలని అనుకుంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో చిరు లుక్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మొత్తానికి ఈ సినిమా ఐదుగురి కెరీర్ ని డిసైడ్ చేయనుంది.