తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ( Adah Sharma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమా( Heart Attack )తో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.ఇది ఇలా ఉంటే ఇటీవల అదాశర్మ ది కేరళ స్టోరీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
మొదట్లో ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తరువాత పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.
అంతేకాకుండా ఈ మూవీ( The Kerala Story )తో ఈ ముద్దుగుమ్మ భారీగా పాపులారీటిని సంపాదించుకుంది.ఇంతకుముందు పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కిందని చెప్పవచ్చు.ఈ ఒక్క మూవీతో ఈమె దేశవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే అదా శర్మ తాజాగా నటించిన చిత్రం కమాండో.ఈ మూవీ ఆగస్టు 11న నుంచి ఇది హాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో గత కొన్నిరోజులుగా బిజీగా ఉన్న ఆమె తాజాగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఫుడ్ అలర్జీ( Food Allergy ), డయేరియాతో అనారోగ్యానికి గురైన ఆమె బుధవారం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె తొందరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.