తాడికొండపై ' డొక్కా' కన్ను ! జగన్ హామీ ఇచ్చారా ?

అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం విషయంలో ఆసక్తికరమైన జరుగుతుంది.ఇక్కడ వైసిపి ( YCP party )నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఆ పార్టీకి దూరమవడం, స్వతంత్ర ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడంతో ఇప్పుడు ఆ సీటు విషయంలో మాజీ మంత్రి , వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్( Dokka manikya varaprasad ) ఆశలు పెట్టుకున్నారు.

 Dokka' Tadikonda Did Jagan Promise, Dokka Manikya Varaprasad, Jagan, Ap Cm Ja-TeluguStop.com

గతంలో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పనిచేశారు.దీంతో మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

ఈ మేరకు తన మనసులో మాటను బయటపెట్టారు.గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి పోటికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం జగన్ కు తాను చెప్పానని మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్సీ డొక్కా ప్రసాద్ తెలిపారు.

ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఆయనే నిర్ణయిస్తారని మాణిక్య వరప్రసాద్ అన్నారు.తుళ్లూరు మండలం వెంకటపాలెం లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న వరప్రసాద్ తాడికొండ నియోజకవర్గ అంశంపై స్పందించారు.

<img src="https://telugustop.com/wp-content/uploads/2023/07/Dokka-manikya-varaprasad-jagan-ap-cm-jagan-YSRCP-TDP-MLA-Sridevi-undavalli-Sridevi-ap-government.jpg “/>

ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని,  సీఎం జగన్ ( CM jagan )ఆదేశిస్తే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వరప్రసాద్ అన్నారు.ప్రస్తుతం ఇక్కడ వైసిపికి అభ్యర్థిలేరు.ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి పార్టీకి దూరం కావడంతో, ఇక్కడ మాణిక్య ప్రసాద్ పోటీ చేయాలని చూస్తున్నారు.ఇప్పటికే జగన్ నుంచి హామీ పొందినట్లుగాను ప్రచారం జరుగుతుంది.

Telugu Ap Cm Jagan, Ap, Dokkamanikya, Jagan, Mla Sridevi, Ysrcp-Politics

అమరావతి పరిధిలో ఉన్న ఈ తాడికొండ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసిపి జెండా ఎగురవేయాలి అనే పట్టుదలతో జగన్ ఉన్నారు.అమరావతి సెంటిమెంట్ ముడిపడి ఉన్న నియోజకవర్గం కావడంతో, ఈ నియోజకవర్గాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉన్న మాణిక్య వరప్రసాద్ అయితే విజయం తధ్యం అని జగన్ అంచనా వేస్తుండడంతోనే , ఈ విధంగా ఈ నియోజకవర్గంలో పనిచేసుకోవాలని , వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే విధంగానే జగన్ సంకేతాలు ఇస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube