ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) తన స్నేహితుడు, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో కలిసి క్రోన్‌స్టాడ్ట్ అనే పట్టణంలో పర్యటించారు.ఈ క్రమంలోనే వారు ఒక అందమైన చర్చిని దర్శించి అక్కడికి వచ్చిన వారిని కలుసుకున్నారు.
ఆ సమయంలో ఆ చర్చిలో ఒక జంట పెళ్లి చేసుకుంది.ఆ వధూవరులు పుతిన్ రాకను చూసి సర్‌ప్రైజ్ అయ్యారు.
వధువు అధ్యక్షుడు పుతిన్‌తో ఒక సెల్ఫీ తీసుకోవాలని కోరుకుంది.
అంతేకాదు ఆమె ధైర్యంగా వెళ్లి సెల్ఫీ కావాలి సార్ అని పుతిన్‌ను అడగ్గా అధ్యక్షుడు వెంటనే ఓకే చెప్పేశారు.తర్వాత వధూవరులు పుతిన్, అలెగ్జాండర్‌లతో( Alexanders ) కలిసి సెల్ఫీ తీసుకున్నారు.ఈ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్‌కి సంబంధించిన వీడియో ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ అయి బాగా పాపులర్ అయింది.
ఇద్దరు అధ్యక్షులతో ఒకేసారి ఫొటో తీసుకునే అవకాశం పొందిన ఆ వధువు చాలా లక్కీ అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అధ్యక్షుడు పుతిన్ బలమైన, ధైర్యవంతమైన నాయకుడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.అయితే అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్( Ukraine ) ప్రజలపై యుద్ధం ప్రకటించాడని, అతనొక కసాయి వాడిని, యుద్ధ నేరస్థుడు అని ఇంకొందరు విమర్శలు చేశారు.ఏది ఏమైనా పుతిన్ వధువు కోరికను మన్నించి ఆమెకు ఒక మరపురాని జ్ఞాపకాన్ని మిగిల్చారు.
షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వచ్చాయి.దీన్ని మీరు కూడా చూసేయండి.