ఎలాన్ మస్క్( Elon Musk ) ట్విట్టర్‌ని చేజిక్కించుకున్న తరువాత అందులో భారీ మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.అందులో కొన్ని యూజర్ ఫ్రెండ్లీ అయితే మరికొన్ని యూజర్లకు తలనొప్పిగా మారేవి కొన్ని.
ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ ఎక్స్ (X)గా రీబ్రాండ్ కావడానికి సిద్ధ పడింది.ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ బ్లూబర్డ్ లోగో కూడా మారి దాని స్థానంలో ఎక్స్ లోగో రానుంది.
ఈ మార్పులను మస్క్ అధికారికంగా ఆల్రెడీ ప్రకటించిన విషయం విదితమే.తాజాగా ట్విట్టర్ మాతృ సంస్థకు కూడా “X కార్పొరేషన్”( X Corporation ) అని పేరు పెట్టడం జరిగింది.X.com డొమైన్ సైతం కొనుగోలు చేసి దాని ద్వారా ట్విట్టర్‌కు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు ఎలాన్ మస్క్.
ఈ క్రమంలో ట్విట్టర్ కొత్త సీఈవో లిండా యాకరినో ( CEO Linda Yacarino )X గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘X’ అనేది ట్విట్టర్‌లో హద్దే లేని ఫ్యూచర్ ఇంటరాక్టివిటీని సూచిస్తుందని చెప్పుకొచ్చారు.భవిష్యత్తులో X ప్లాట్‌ఫామ్‌లో ఆడియో, వీడియో ద్వారా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా తెలిపారు.
మెసేజింగ్ ఫీచర్లు, పేమెంట్స్/బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు.ప్రపంచ స్థాయిలో కొత్త అవకాశాలను అన్వేషించగల మోస్ట్ ఇంటరాక్టివ్, డైనమిక్ ప్లాట్‌ఫామ్‌గా ‘X’ నిలుస్తుందని ఈ సందర్భంగా అయన అభిప్రాయ పడ్డారు.
ఇలా అన్ని విషయాల్లో X మనల్నందరినీ కనెక్ట్ చేస్తుందని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
ఇకపోతే ట్విట్టర్ రీబ్రాండెడ్ ప్లాట్‌ఫామ్ AIతో పని చేస్తుందని, ప్రస్తుత ఊహకు మించిన మార్గాల్లో ప్రజలను కనెక్ట్ చేస్తుందని లిండా తన ట్వీట్‌లో ధీమా వ్యక్తం చేశారు.అందుకే యూజర్లు ట్విట్టర్‌ను వేరే రేంజ్‌లో ఆలోచించాలని అయన సూచించారు.ప్రపంచానికి ‘X’ని పరిచయం చేయడానికి మస్క్‌తో సహా సొంత టీమ్‌లు, పార్ట్‌నర్లతో కలిసి పనిచేయడం ఎగ్జైటింగ్‌గా ఉందని ఈ సందర్భంగా అయన తెలిపారు.
మస్క్ జులై 24 తేదీలోగా ట్విట్టర్ లోగో Xగా మారుతుందని ఒక ట్వీట్ చేయడం అందరికీ తెలిసినదే.లోగో షేప్ సేమ్ ఇప్పటి లోగో లాగానే ఉంటుందని, కాకపోతే పక్షి స్థానంలో X లెటర్ వస్తుందని వివరించారు.
సాధారణంగా సామర్థ్యానికి, సుసాధ్యాలకు, కొత్త ప్రారంభానికి X లెటర్‌ను సింబల్‌గా చూస్తారు.మస్క్ ఈ అక్షరాన్ని స్పేస్‌ఎక్స్‌లో ఆల్రెడీ వాడేయడం జరిగింది.