ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో పాటు, బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.ఒకే వర్గానికి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటూ మరింత రాజకీయ వేడి పెంచుతున్నారు.
తాజాగా కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇద్దరు కీలక నాయకులు మధ్య వైరం మొదలైంది.ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ , రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య ఆధిపత్తి పోరు తీవ్రస్థాయికి వెళ్ళింది.
ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు విడివిడిగా ఆత్మీయ సమ్మేళనాలు ఈరోజు ఏర్పాటు చేశాయి. చోడవరం బైపాస్ రోడ్డు లోని ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారు .పది గంటలకు మొదలయ్యే ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మద్దతుదారులు రానున్నారు.
మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అయితే ఇది కొద్దిరోజుల క్రితం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది.దీనికి కౌంటర్ గానే వేణు వర్గం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయంశం గా మారింది.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లయిన సందర్భంగా, ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నా , ఈ సమావేశానికి జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే వేణు తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది.ఈ సమావేశం ద్వారా ప్రత్యర్థ వర్గానికి మంత్రి వేణు మధుతదారులు ఎటువంటి సంకేతాలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది .ముఖ్యంగా రామచంద్రపురం టికెట్ విషయంలో మంత్రి వేణు , పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు ఉన్నాయి .వచ్చే ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఈ టిక్కెట్ విషయంలో అధిష్టానం తనకే హామీ ఇచ్చిందని మంత్రి వేణు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోని ఇప్పుడు బల ప్రదర్శనకు దిగుతుండడం వైసిపిలో దుమరాన్ని రేపుతోంది.
ఈనెల 26న సీఎం జగన్ అమలాపురం పర్యటనకు వస్తున్నారు.ఆ రోజునే వేణు, సుభాష్ చంద్రబోస్ జగన్ తో ఈ విషయంపై చర్చించి ఒక క్లారిటీ కి రావాలని చూస్తున్నారు.
అంతకంటే ముందుగానే బల ప్రదర్శనకు దిగుతూ పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని , పార్టీ పరువు దెబ్బతింటుందనే వాదన తరి పైకి వస్తుంది.ఈ ఇద్దరు కీలక నేతల విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? రామచంద్రపురం టికెట్ విషయంలో ఎవరికీ ఏ హామీ ఇస్తారు అనేది తేలాల్సి ఉంది.