బాలీవుడ్ నటి స్వర భాస్కర్( Swara Bhaskar ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది.
అంతే కాకుండా ఈమె పలు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.
ఈమె ఇటీవలే రాజకీయ నాయకుడు అయిన ఫహద్ అహ్మద్ ను( Fahad Ahmad ) సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన విషయం తెలిసిందే.తర్వాత ఆలస్యంగా ఆ విషయాన్ని వెల్లడిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.తన భర్త ఫహద్ అహ్మద్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్వీట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.ప్రస్తుతం గర్భవతిగా( Pregnant ) ఉన్న స్వర భాస్కర్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ తన ప్రెగ్నెన్సీకి తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూనే ఉంది.తాజాగా తాను బేబీ బంప్‌తో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో ప్రకటించిన తర్వాత కొందరు నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు.గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు.
అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మత పెద్దలు పేర్కొన్నారు.పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా కొందరు విమర్శించారు.
కాగా ఫహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది.