భారతదేశంలో అతి చిన్న విమానాశ్రయం ఏదో మీకు తెలుసా ..!

దేశంలో మొత్తం 153 విమానాశ్రయాలు ఉన్నాయి.అందులో 118 దేశీయ విమానాశ్రయాలు, 35 విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాల కోసం సిద్ధం చేయబడ్డాయి.

 Do You Know Which Is The Smallest Airport In India, Baljek Airport, Meghalaya,-TeluguStop.com

ఈ విమానాశ్రయాల ద్వారా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుంటారు.అయితే విమానం అత్యంత వేగమైన రవాణా విధానం.

ప్రయాణికులు విమానాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని సౌకర్యవంతంగా ప్రయాణిస్తూ ఉంటారు.మిగతా ప్రయాణాలతో పోల్చుకుంటే విమాన ప్రయాణం అనేది కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

ఇప్పుడు మనం దేశంలో ఉండే అత్యంత చిన్న విమానాశ్రయం ఎక్కడ ఉందో.ఆ విమానాశ్రయానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.దేశంలో అతి చిన్న విమానాశ్రయం పేరు బాల్జాక్ విమానాశ్రయం(Baljek Airport ).ఈ చిన్న విమానాశ్రయాన్ని తురా విమానాశ్రయం అని కూడా పిలుస్తారు.ఈ విమానాశ్రయం మేఘాలయ రాష్ట్రంలో ఈశాన్య దిశలో 33 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ విమానాశ్రయాన్ని 20 సీట్ల విమానం డోర్నియర్ 228 కోసం నిర్మించారు.

ఈ విమానాశ్రయంలో రన్ వే( Runway ) కేవలం ఒక్క కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.భారతదేశంలో( India ) ఉండే మిగతా విమానాశ్రయాలలో రన్ వే లు ఒక్క కిలోమీటర్ కంటే పొడవుగానే ఉన్నాయి.ఈ కారణం వల్లనే బాల్జాక్ విమానాశ్రయాన్ని భారత దేశంలో ఉండే అతి చిన్న విమానాశ్రయంగా చెప్పవచ్చు.ఈ విమానాశ్రయాన్ని 12 కోట్ల 52 లక్షల రూపాయలతో 2008లో నిర్మించారు.

ఇక్కడ కేవలం చిన్న విమానం మాత్రమే దిగడానికి వీలు ఉంటుంది.భూమిని సేకరించి ఈ విమానాశ్రయాన్ని విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube