Alia Bhatt : ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు అలియా భట్ ఓకే చెప్పడం సాధ్యమా.. అన్యాయం చేయొద్దంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ( S.S.Rajamouli )దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్( RRR ).ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.ఇది ఇలా ఉంటే ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉండబోతోంది అన్న విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

 Fans Special Request To Alia Bhatt Over Rrr Part 2-TeluguStop.com

దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.కాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు విజయేంద్రప్రసాద్.

Telugu Alia Bhatt, Bollywood, Fans, Rrr, Rajamouli, Tollywood-Movie

ఇంతవరకు బాగానే ఉంది, కానీ అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ వస్తే అందరికీ ఆనందమే.కానీ బాలీవుడ్ జనాలకు మాత్రం కోపంగా ఉంది.కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియాభట్( Alia bhatt ) హీరోయిన్ గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

తెలుగులో ఆమె డెబ్యూ మూవీ ఇదే.ఈ సినిమాలో అలియా పాత్రపై చాలా ప్రచారం నడిచింది.కట్ చేస్తే, సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు.సినిమా రిలీజైన టైమ్ లో బాలీవుడ్ లో దీనిపై చాలా పెద్ద చర్చ నడిచింది.అలియా భట్ పోషించిన పాత్ర వేస్ట్ అంటూ ఉత్తరాది ప్రేక్షకులు పెదవి విరిచారు.

Telugu Alia Bhatt, Bollywood, Fans, Rrr, Rajamouli, Tollywood-Movie

ఒక దశలో సినిమాలో తన పాత్రపై అలియాభట్ అసంతృప్తి వ్యక్తం చేసిందనే ఊహాగానాలు కూడా చెలరేగాయి.దానిపై వెంటనే ఆమె స్పందించింది.రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయడం గర్వకారణం అంటూ కవర్ చేసుకుంది.

తాజాగా విజయేంద్ర ప్రసాద్ ప్రకటించిన స్టేట్మెంట్ తో మరోసారి అలియా భట్ అంశం తన పైకి వచ్చింది.ఒకవేళ ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ తీస్తే, కనీసం పార్ట్-2లోనైనా కాస్త నిడివి ఉండేలా, ప్రాధాన్యం పెరిగేలా క్యారెక్టర్ ను ఎంపిక చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో అలియాభట్ కు విజ్ఞప్తి చేస్తున్నారు ఆమె అభిమానులు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియాభట్, 2-3 సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది.ఇక నటనా పరంగా చూసుకుంటే ఓ బ్రిటిషర్ వచ్చి ఆమెను కడుపులో తంతాడు.ఆ ఒక్క సీన్ మినహాయిస్తే, అలియాకు ఆర్ఆర్ఆర్ లో చెప్పుకోదగ్గ సీన్ లేదు.అలాంటి తక్కువ నిడివి పాత్రను, ప్రాధాన్యం లేని క్యారెక్టర్ ను ఆర్ఆర్ఆర్-2లో చేయొద్దంటూ ఇప్పట్నుంచే ఆమెకు సూచనలు చేస్తున్నారు ఫ్యాన్స్.

దీంతో ఆలియా భట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని సినిమా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube