టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ), మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసిన నటించిన తాజా చిత్రం బ్రో.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా బిజీబిజీగా ఉండడంతో పాటు వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్ల్లో నిలిచారు.
దాంతో రాజకీయ ప్రభావం కాస్త సినిమా మీద పడేలా కనిపిస్తోంది.మరొకవైపు ప్రమోషన్స్ కూడా నత్తనడకన సాగుతున్నాయి.టీజర్, లిరికల్ సాంగ్, మేకింగ్ వీడియో వదలారు కానీ అవేవీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత రేంజ్ లో లేవన్నది నిజం.
ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది అన్న విషయంపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.పవన్ ఎంట్రీ తరువాత సినిమా మొదలైన ఇరవై నిమిషాల తర్వాత ఉంటుందట.
అయితే అప్పటిదాకా ప్రైవేట్ కంపెనీలో మధ్య తరగతి ఉద్యోగిగా సాయి ధరమ్ తేజ్( Sai dharam tej ) కష్టాలను ఫన్నీగా చూపిస్తారు.
సమయం మనిషి రూపంలో రావడం మొదలయ్యాక అక్కడి నుంచి పవన్ పాత్ర మొత్తం లెన్త్ లో తొంబై నిమిషాల దాకా వస్తుందట.అంటే ఇంకో ముప్పావు గంట తేజు, ఇతర తారాగణం మధ్య సన్నివేశాలు, పాటలతో గడిచిపోతుంది.అయినా సరే పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆద్యంతం ఫీలయ్యేలా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) తెలివిగా స్క్రీన్ ప్లే రాసినట్టు తెలుస్తోంది.
దర్శకుడు సముతిరఖని ఒరిజినల్ తో పోలిస్తే ఈ మార్పులు ఎక్కువే అయినప్పటికీ బిజినెస్ దృష్ట్యా కీలకం కావడంతో వాటిని అంతే పర్ఫెక్ట్ గా తెరకెక్కించారని అంటున్నారు.తమన్ మ్యూజిక్ పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ పరంగానే ఎక్కువ మెప్పిస్తుందని అంటున్నారు.