తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) ఏదైనా కొత్త చిత్రం వస్తుంది అంటే చాలు అది ఏదో ఒక హాలీవుడ్ సినిమా( Hollywood ) నుంచి కాపీ కొట్టింది అని వార్తలు వస్తూనే ఉంటాయి.రాజమౌళి ( Rajamouli ) నుంచి అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ కూడా హాలీవుడ్ సినిమాలను ఆదర్శంగా తీసుకుంటారు అలాగే అందులోంచి కొంత ఇన్స్పైర్ అయిపోయి కథలను రాసుకుంటూ ఉంటారు.
మరి కొంత మంది అయితే పూర్తి హాలీవుడ్ సినిమాలను ఎత్తుకచ్చేస్తారు.ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం అయితే హాలీవుడ్ సినిమాలను తెలుగువారు కాపీ కొడితే పెద్ద విషయం కాదు కానీ మన తెలుగు సినిమాలను హాలీవుడ్ వారు కాపీ కొడితేనే అది సంచలనమైన విషయం.

మరి తెలుగు సినిమాలను కాపీ కొట్టి హాలీవుడ్ వారు తీసిన సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇక హాలీవుడ్ వారు మన సినిమాలను తీసుకొని వారు సినిమాలు చేయడం మాత్రమే కాదు కొన్నిసార్లు ఆస్కార్ కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.స్వాతిముత్యం( Swatimuthyam ) సినిమా కథను ఉన్నది ఉన్నట్టుగా ఫారెస్ట్ గంప్( Forrest Gump ) అనే పేరుతో సినిమా తీశారు.ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గులాబీ సినిమా తరహాలో టేకెన్ సినిమా లో చాలా వరకు సీన్స్ ఉంటాయి.

కానీ అది మన గులాబీ చిత్రం అంటే మాత్రం ఆదర్శకుడు ఒప్పుకోడు.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించినటువంటి చిత్రాన్ని ఫియర్ పేరుతో హాలీవుడ్ లో తీశారు.కమల్ హాసన్ నటించిన అభయ్ సినిమాను( Abhay ) పూర్తి స్థాయిలో కిల్ బిల్( Kill Bill ) అనే చిత్రంలో వాడారు టారంటినో ఈ సినిమాను తీశాడు.ప్రాజెక్టుని దొంగతనం చేసి ఈ టి అనే పేరుతో ఏలియన్ సినిమా తీశారు ఇవన్నీ కూడా మన తెలుగు సినిమాల యొక్క మూల కథలో నుంచి వచ్చినవే.

వీటి మూల కథలు తెలుగువి అని ఎవరు ఎక్కడ ప్రకటించుకోలేదు పైగా మెల్ గిబ్సన్ పూర్తిస్థాయిలో సీన్ టు సీన్ కాపీ కొట్టి గోపీచంద్ హీరోగా తీసినటువంటి ఒక్కడున్నాడు ( Okkadunnadu ) చిత్రాన్ని తానే కథ రాసినట్టుగా గెట్ ద గ్రింగో( Get The Gringo ) అనే చిత్రాన్ని తీశాడు.కనీసం క్రెడిట్ కూడా ఇవ్వకుండా ఇలా హాలీవుడ్ వాళ్ళ సైతం తెలుగు సినిమాలను కాపీ కొట్టడం చాలా దారుణం.