తెలంగాణ, సీఎం కేసీఆర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కసు వెళ్లగక్కారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.అవినీతిలో కాంగ్రెస్ ను బీజేపీ మించిపోయిందని ఆరోపించారు.
మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో అవినీతి మీ పాలనకు సాక్ష్యమని తెలిపారు.రాఫెల్ స్కాం, బ్యాంకులకు లక్షల కోట్లు టోకరా పెట్టిన బడా బాబులు మీ కుటుంబ సభ్యులంటూ విమర్శలు గుప్పించారు.
కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు మోదీ అంటూ ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ, మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని ఆరోపించారు.