తెలంగాణలో గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్ మరియు బీజేపీ( BJP ) మద్య దోస్తీ ఉందని బిఆర్‌ఎస్ బీజేపీకి బీ టీంలా వ్యవహరిస్తోందని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని పదే పదే విమర్శిస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం టాపిక్ అయింది.
అయితే బీజేపీ మరియు కాంగ్రెస్ తో తాము ఎంతమాత్రం కలిసే ప్రసక్తే లేదని, తాము ఎవరికి బీ టీం కాదని కేసిఆర్ మరియు కేటిఆర్ స్పష్టం చేసినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.దీనికి కారణం లిక్కర్ స్కామ్ లో కవిత కేసు హోల్డ్ ప్రస్తావన ఈ మద్య లేకపోవడంతో ఈ రకమైన వార్తలు గట్టిగా వినిపించాయి.
బీజేపీ మరియు బిఆర్‌ఎస్ మద్య లోపాయికారి ఒప్పందం జరిగిందనే గుసగుసలు వినిపించాయి.ఇలా బీజేపీ మరియు బిఆర్‌ఎస్ మద్య దోస్తీ వ్యవహారంలో వస్తున్న వార్తలపై తెలంగాణ బీజేపీ నేతలు పెద్దగా స్పందించింది లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా వరంగల్ పర్యటనకు వచ్చిన మోడీ..కేసిఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది అందరికీ ఆసక్తి కలిగించింది.అయితే ఎప్పటిలాగే మోడీ.
కేసిఆర్( CM KCR ) ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు.తెలంగాణలో కేసిఆర్ లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారని, తెలంగాణ కుటుంబ పాలనలో కూరుకుపోయిందని బిఆర్‌ఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మోడీ విమర్శల దాడి చేశారు.ఉద్యమ సమయంలో ఎన్నో హామీలిచ్చిన కేసిఆర్.ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసిఆర్ కు బుద్ది చెప్పడం ఖాయమని ఘాటు విమర్శలు చేశారు మోడీ.
ప్రధాని చేసిన వ్యాఖ్యలను చేస్తూ బిఆర్‌ఎస్ తో బీజేపీ దోస్తీ అనే మాట.కేవలం పుకార్లే అని తేలిపోయింది.అయితే మరి డిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) ,లో కవిత కేసు ఎందుకు సైలెంట్ అయిందనే దానికి స్పష్టమైన సమాచారం లేనప్పటికి కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా దాని ప్రకారం.కవిత అరెస్ట్ కు సంబంధించి స్పష్టమైన ఆధారరాలు లేనందువల్లనే కేంద్ర దర్యాప్తు సంస్థలు మౌనం పటిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి బిఆర్‌ఎస్ బీజేపీ మద్య ఎప్పటికీ దోస్తీ కుదిరే ప్రసక్తే లేదని, ఈ రెండు పార్టీలు ఎప్పటికీ ప్రత్యర్థులే అని ప్రధాని మోడీ మరోసారి నిరూపించారు.