హైదరాబాద్ లో మహేంద్రసింగ్ ధోని బర్త్ డే వేడుకల ఏర్పాటు.. 52 అడుగుల భారీ కటౌట్..!

క్రికెటర్ల విషయానికి వస్తే మహేంద్రసింగ్ ధో( MS Dhoni )ని కు ఉండే ఫాలోవర్స్ సినిమా హీరోలకు కూడా ఉండరేమో.తాజాగా జరిగిన ఐపీఎల్ లో మహేంద్రసింగ్ ధోని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి దిగితే ఒక్కసారిగా స్టేడియం అంతా ఇలలు, కేకలతో ఎంతలా మారు మోగుతుందో అందరికీ తెలిసిందే.

 Mahendra Singh Dhoni's Birthday Celebrations In Hyderabad.. 52 Feet Huge Cutout.-TeluguStop.com

సినిమా హీరోల కంటే ఎక్కువ మహేంద్రసింగ్ ధోని కి అభిమానులు ఉండడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు.ఎందుకంటే క్రికెట్ ఆడడంలో ధోని స్టైల్ సపరేట్ గా ఉంటుంది.

భారత జట్టు విజయాలు సాధించడంలో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించాడు.కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహేంద్రసింగ్ ధోని కి అభిమానులు ఉన్నారు.

Telugu Hyderabad, Latest Telugu, Mahendrasingh-Sports News క్రీడలు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్ సీజన్ లో జట్టు మ్యాచ్ ఆడిన ప్రతిసారి స్టేడియం పసుపు వర్ణాలతో కలకలలాడింది.అయితే ఈ సీజన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం కూడా గమనార్హం.ఇలా ఉండగా మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు జూలై 7.హైదరాబాదులో ఉండే మహేంద్రసింగ్ ధోని అభిమానులు ఈసారి ధోని బర్త్ డే సెలబ్రేషన్స్ ను చాలా వినూత్నం గా ప్లాన్ చేస్తున్నారు.హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే దేవి థియేటర్ దగ్గర 52 అడుగుల మహేంద్రసింగ్ ధోని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.

Telugu Hyderabad, Latest Telugu, Mahendrasingh-Sports News క్రీడలు

రేపు జూలై 7న మహేంద్రసింగ్ ధోని బర్త్ డే( Mahendra Singh Dhoni birthday ) వేడుకలు చాలా ఘనంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జరగనున్నాయి.ఈ వేడుకలలో మహేంద్రసింగ్ ధోని ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.మహేంద్రసింగ్ ధోని భారత జట్టు కెప్టెన్ గా 2007 లో టీ20 వరల్డ్ కప్, 2011 లో వన్డే వరల్డ్ కప్, 2013 లో ఛాంపియన్ ట్రోఫీ లను ఇచ్చాడు.2024 ఐపీఎల్ లో ఆడతాడా.లేదా.

అనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube