కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయనున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే.
అయితే అనారోగ్యం కారణంగానే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు అవుతున్నట్లు కేబినెట్ కార్యదర్శికి ఆయన సమాచారం అందించారు.కిషన్ రెడ్డి ఫోన్ కూడా ఆఫ్ వస్తుండగా మంత్రిత్వ శాఖ అధికారులకు కూడా ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించేందుకు కిషన్ రెడ్డి సుముఖంగా లేరని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన కేబినెట్ భేటీకి సైతం దూరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.