ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీలు ప్రత్యక్ష పార్టీల మధ్య వార్ మొదలవుతోంది.
ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర మొదలుపెట్టిన తరవాత జనసైనికులు జోరు పెంచారు.సోషల్ మీడియాలో వైసీపీ( YCP ) ని టార్గెట్ చేస్తున్నారు.
వైసీపీ వార్ జనసేన వైపు తిరిగింది.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌పై వైసీపీ కార్యకర్తలు సీఎం వైఎస్ జగన్ పై జనసేన సైనికులు బురదజల్లడం మొదలుపెట్టారు.
ఇంతవరకు బాగానే ఉన్నా కొంతమంది సోషల్ మీడియా అకౌంట్లలో దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) పై పోస్టులు పెడుతున్నారు.వైఎస్సార్‌ను అవమానపరుస్తూ, ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.పొలిటికల్ మిసైల్ అనే అకౌంట్లను జనసైనికులు నడిపిస్తున్నారని ప్రొఫైల్ పిక్చర్లు చూస్తే అర్థమవుతోంది.దీంతో వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి మొదలుపెట్టారు.ఈ క్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ( Ananta Sriram )పేరు బయటికి వచ్చింది.ఈ పొలిటికల్ మిసైల్ అకౌంట్లకు అనంత శ్రీరామ్ దన్నుగా ఉన్నారని, ఆయనే వ్యాఖ్యలు రాసి ఇస్తున్నారని ప్రచారం మొదలైంది.
దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై అనంత శ్రీరామ్ స్పందించారు.ఆ విషయం పై స్పందిస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు.దివంగత ముఖ్యమంత్రి, మహానేత శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి వ్యతిరేకంగా, ఆయన్ని అవమానపరిచేలా పొలిటికల్ మిసైల్( political missile ) అన్న ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ పోస్టులు పెడుతున్నారు.ఆ రాతల వెనుక, పోస్టుల వెనుక ఉన్నది నేనే అని చెప్పి వదంతులు వ్యాపించాయి.
నాకు ఆ రాతలకు, పోస్టులకు ఎటువంటి సంబంధం లేదు.నేను అన్ని పార్టీలకు పాటలు రాస్తాను.
అది నా వృత్తి.అంతేకానీ, ఏ పార్టీ మీద వ్యక్తిగతంగా నాకు ఏ అభిప్రాయం లేదు.
అవన్నీ నమ్మొద్దని వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వీడియోలో అనంత శ్రీరామ్ తెలిపారు.