Ananta Sriram : వైసీపీని ఇన్సల్ట్ చేస్తూ పోస్టులు.. తనకు ఎటువంటి సంబంధం లేదన్న అనంత శ్రీరామ్?
TeluguStop.com
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీలు ప్రత్యక్ష పార్టీల మధ్య వార్ మొదలవుతోంది.
ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర మొదలుపెట్టిన తరవాత జనసైనికులు జోరు పెంచారు.
సోషల్ మీడియాలో వైసీపీ( YCP ) ని టార్గెట్ చేస్తున్నారు.వైసీపీ వార్ జనసేన వైపు తిరిగింది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌పై వైసీపీ కార్యకర్తలు సీఎం వైఎస్ జగన్ పై జనసేన సైనికులు బురదజల్లడం మొదలుపెట్టారు.
"""/" /
ఇంతవరకు బాగానే ఉన్నా కొంతమంది సోషల్ మీడియా అకౌంట్లలో దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) పై పోస్టులు పెడుతున్నారు.
వైఎస్సార్‌ను అవమానపరుస్తూ, ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.పొలిటికల్ మిసైల్ అనే అకౌంట్లను జనసైనికులు నడిపిస్తున్నారని ప్రొఫైల్ పిక్చర్లు చూస్తే అర్థమవుతోంది.
దీంతో వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి మొదలుపెట్టారు.ఈ క్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ( Ananta Sriram )పేరు బయటికి వచ్చింది.
ఈ పొలిటికల్ మిసైల్ అకౌంట్లకు అనంత శ్రీరామ్ దన్నుగా ఉన్నారని, ఆయనే వ్యాఖ్యలు రాసి ఇస్తున్నారని ప్రచారం మొదలైంది.
"""/" /
దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై అనంత శ్రీరామ్ స్పందించారు.
ఆ విషయం పై స్పందిస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు.దివంగత ముఖ్యమంత్రి, మహానేత శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి వ్యతిరేకంగా, ఆయన్ని అవమానపరిచేలా పొలిటికల్ మిసైల్( Political Missile ) అన్న ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఆ రాతల వెనుక, పోస్టుల వెనుక ఉన్నది నేనే అని చెప్పి వదంతులు వ్యాపించాయి.
నాకు ఆ రాతలకు, పోస్టులకు ఎటువంటి సంబంధం లేదు.నేను అన్ని పార్టీలకు పాటలు రాస్తాను.
అది నా వృత్తి.అంతేకానీ, ఏ పార్టీ మీద వ్యక్తిగతంగా నాకు ఏ అభిప్రాయం లేదు.
అవన్నీ నమ్మొద్దని వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వీడియోలో అనంత శ్రీరామ్ తెలిపారు.
చైతన్య, శోభిత కాంబోలోలో ఆ సినిమా మిస్సైందా.. సమంత నటించిన ఆ సినిమా ఇదే!