కొడుకును పనస తోటకు( Panasa garden ) తీసుకువెళ్లి చెట్టుకు కట్టేసి, పోసి నిప్పు పెట్టాడు ఓ తండ్రి.ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సాధారణంగా కొడుకు చేతికి అంది వస్తే తల్లిదండ్రులు తమకు ఎంతో ఆసరాగా ఉంటాడని సంబరపడతారు.కానీ ఆ కొడుకు బాధ్యతను మరిచి చెడు వ్యసనాలకు బానిస అవడంతో పాటు తల్లిదండ్రులకు తలనొప్పిగా మారడంతోనే తండ్రి ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు( Bangalore ) సమీపంలో ఉండే దొడ్డబళ్ళపుర( Doddaballapura ) తాలూకా వాణిగరహాళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వాణిగరహాళ్లి( Vanigarahalli ) లో జయరామయ్య ( Jayaramaiah )అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఇతనికి ఆదర్శ్( Adarsh ) (28) అనే కుమారుడు సంతానం.ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు.కానీ ఆదర్శ్ మాత్రం చెడు వ్యసనాలకు అలవాటు పడి బాధ్యత రహితంగా ఉండేవాడు.అంతేకాకుండా ప్రతిరోజు మద్యం తాగొచ్చి తల్లిపై దాడి చేసేవాడు.
కొడుకు చూపించే నరకం ఆ తల్లిదండ్రులు భరించలేకపోయేవారు.

శుక్రవారం రాత్రి కూడా ఆదర్శ్ పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేశాడు.ఇదంతా చూస్తున్న జయరామయ్యకు పట్టలేని కోపం వచ్చింది.రాత్రివేళ తాగొచ్చి గొడవ చేయడంతో చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉండడం జయరామయ్యకు కాస్త అవమానకరంగా అనిపించడంతో ఆదర్శ్ ను తీసుకొని పనస తోటకు వెళ్లాడు.
అక్కడ ఒక చెట్టుకు ఆదర్శ్ ను కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి వచ్చి, జయరామయ్యను అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్పీ మల్లికార్జున తెలిపారు.