సోషల్ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చాక వింతైన విషయాలు బయటపడుతున్నాయి.దాంతో మనం నోరు వెళ్ళబెట్టుకొని చూడాల్సిన పరిస్థితి వస్తోంది.
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు.ఈ విషయాన్ని కొంతమంది ఔత్సాహికులు పదేపదే రుజువు చేస్తూ వుంటారు.
తాజాగా ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట తెగ రచ్చ చేస్తోంది.మనం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అసాధారణమైన భవనాలు, ఇళ్లు, గదులు, బాత్రూమ్లతో సహా అనేక రకాల నిర్మాణ వీడియోలను చూస్తుంటాం.
ఈ క్రమంలో వాని నిర్మాణ సౌందర్యం ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంది.
అదేవిధంగా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చుట్టూ అక్వేరియంతో నిర్మించి ఉన్న జపాన్ టాయిలెట్ ( Japan toilet )నెటిజన్లను ఆశ్చర్యసాగరంలో ముంచేస్తోంది.సాంకేతికత, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడంలో జపాన్ ఎప్పుడూ ముందుంటుందనే విషయం అందరికీ విదితమే.ఈ క్రమంలోనే జపాన్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు మరో వీడియో వైరల్‌గా మారింది.
అవును, జపాన్ అక్వేరియం లోపల టాయిలెట్‌ను నిర్మించి, చూపరులను ఆకట్టుకుంటోంది.కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తోంది.
విషయంలోకి వెళితే, జపాన్ హిప్పోపాప కేఫ్‌లో అక్వేరియం టాయిలెట్( Aquarium ) ఒకదానిని ఏర్పాటు చేసారు.ఇది ఈ కేఫ్ కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది అని స్థానికంగా వున్నవారు చెబుతున్నారు.కేఫ్ లోపల టాయిలెట్ చుట్టూ గాజు గోడలు, నీరు, చేపలతో నిండి ఉండడం మనం ఇక్కడ వీడియోని చూసి తెలుసుకోవచ్చు.దీంతో కొందరు కస్టమర్లు నేచర్ కాల్ కోసం వెళ్లిన క్రమంలో తమను తాము మర్చిపోయి ఎక్కువ సేపు టాయిలెట్లో గడిపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరి కొందరు మాత్రం సిగ్గుతో ఆక్వేరియంను చూసి అలాగే బయటకు వచ్చేస్తున్నారట.ఇకపోతే, ఈ వీడియో గత సంవత్సరం పోస్ట్ చేయగా ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోని వీక్షించడం జరిగింది.